Header Banner

చైనా కెమికల్ ప్లాంట్ లో భారీ పేలుడు.. ఆకాశంలోకి భారీగా ఎగసీన దట్టమైన పొగ, అగ్నికీలలు!

  Wed May 28, 2025 11:22        World

తూర్పు చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న ఒక రసాయన కర్మాగారంలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కర్మాగారం నుంచి పెద్ద ఎత్తున దట్టమైన పొగలు ఆకాశంలోకి ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లగా, ప్రాణనష్టంపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదని చైనా ప్రభుత్వ మీడియా సంస్థలు వెల్లడించాయి. చైనా న్యూస్ ఏజెన్సీ అందించిన వివరాల ప్రకారం.. బీజింగ్‌కు సుమారు 450 కిలోమీటర్ల దూరంలోని గావోమి పట్టణంలో ఉన్న యూదావో కెమికల్ ప్లాంట్‌లో మంగళవారం ఉదయం 11:57 గంటలకు (భారత కాలమానం ఉదయం 9:27) ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను బీజింగ్‌కు చెందిన జిన్‌జింగ్‌బావో మీడియా ప్రసారం చేసింది.

 

ఇది కూడా చదవండి: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?

 

ఆ వీడియోలలో భారీగా బూడిద రంగు పొగ మేఘాలు ఆకాశంలోకి లేవడం, పారిశ్రామిక ప్రాంతంలో మంటలు చెలరేగడం స్పష్టంగా కనిపించాయి. పేలుడు ధాటికి సమీపంలోని దుకాణాల కిటికీలు పగిలిపోయినట్లు తెలుస్తోంది. కొన్ని క్లిప్‌లలో రోడ్లపై చెల్లాచెదురుగా పడి ఉన్న శిథిలాల గుట్టలు, ధ్వంసమైన కార్లు కనిపించాయి. సమాచారం అందుకున్న వెంటనే జాతీయ అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ 55 అగ్నిమాపక వాహనాలను, 232 మంది సహాయక సిబ్బందిని ఘటనా స్థలానికి తరలించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. యూదావో కెమికల్ కంపెనీ పురుగుమందులను తయారు చేస్తుంది. సుమారు 116 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాంట్‌లో దాదాపు 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. చైనాలో పారిశ్రామిక వాడలోని చాలా కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలను సరిగా పాటించడం లేదని, దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయని ఆరోపణలు ఉన్నాయి. 2015లో టియాంజిన్ ఓడరేవు నగరంలోని రసాయన కంపెనీ గోడౌన్ లో సంభవించిన వరుస పేలుళ్లలో 170 మందికి పైగా మరణించగా, 700 మంది గాయపడ్డారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?

 

ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్‌ 60 స్టైలస్‌.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..

 

టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..

 

ఏం అదృష్టం సార్..! అడ్డిమార్‌ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!

 

ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! ఆ రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

లోకేశ్​కు పార్టీలో ఆ పదవి.. జోరుగా చర్చ! జీవీ, ఆనం కీలక వ్యాఖ్యలు!

 

వల్లభనేని వంశీకి దెబ్బపై దెబ్బ.. బెయిల్ పిటిషన్ కొట్టివేత!

        

అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి షాక్! 14 రోజుల రిమాండ్..

 

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లా పేరు మారుస్తూ జీవో జారీ!

 

వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!

 

కేంద్రం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌! రాష్ట్రానికి మరో 2 లక్షల కనెక్షన్లు!

 

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూన్ 2న కీలక ప్రకటనలు! కొత్త ఆరోగ్య పథకం..

 

ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #ChemicalFactoryBlast #Mumbai #Death #ThaneDistrict